
పాపన్నపేట, వెలుగు: బలహీన వర్గాల అభివృద్ధే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని ఎమ్మెల్యే రోహిత్‌రావు అన్నారు. గురువారం ఆయన కలెక్టర్రాహుల్రాజ్తో కలిసి పాపన్నపేటలో సన్నబియ్యం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మండలానికి సంబంధించి 45 రేషన్ షాపులకు 15,556 రేషన్ కార్డులు ఉన్నాయని వాటి ద్వారా 50 వేల102 కుటుంబాలకు సన్న బియ్యం పంపిణీ చేస్తామని చెప్పారు.
కలెక్టర్ రాహుల్రాజ్మాట్లాడుతూ లబ్ధిదారులు సన్న బియ్యం పంపిణీ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్డీవో రమాదేవి, జిల్లా పౌరసరఫరాల అధికారి సురేశ్ రెడ్డి, అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
సన్నబియ్యం పేదలకు వరం
చిన్నశంకరంపేట: సన్నబియ్యం పేదలకు వరం అని ఎమ్మెల్యే రోహిత్ రావు అన్నారు. మండల కేంద్రంలోని ఓ రేషన్ షాపులో కలెక్టర్రాహుల్రాజ్తో కలిసి బియ్యం పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ సన్న బియ్యం పథకం పేదలకు వరం లాంటిదన్నారు. శంకరంపేట ఆర్ మండలంలో 25 రేషన్ షాపులకు 11,411 కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీ చేస్తామన్నారు. కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ సన్న బియ్యం పంపిణీ పథకాన్ని పకడ్బందీగా అమలయ్యే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.